డ్రగ్స్ కేసుపై మరోసారి స్పందించిన అషు రెడ్డి.. ఈ సారి అలా..!?

Anilkumar
ఒకప్పుడు టిక్ టాక్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆశు రెడ్డి. ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకుని పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంది. నిర్మాత కె.వి చౌదరి వద్ద ఈమె డ్రగ్స్ విక్రయించింది  అంటూ ఈమె పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కస్టడీలో ఉన్నటువంటి నిర్మాతకు కె పి చౌదరి 12 మంది పేర్లను బయటపెట్టాడు. దాంతోపాటు ఆయన ఫోన్ కాల్స్ సైతం చూశారూ. ఇక అందులో అషు రెడ్డితో ఆయన ఎక్కువగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇదివరకే స్పందించింది ఈమె. తాజాగా మరోసారి ఈ వార్తలు పై 


మరోసారి పెద్ద ఎత్తున మండిపడుతుంది. తన ఫోన్ కాల్స్ బహిర్గతం చేయడం వల్ల తనకు ప్రతి ఒక్క సెకండ్ కి ఫోన్ వస్తుందని.. దానివల్ల తాను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటూ ఒక వీడియో ద్వారా బయట పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆమె గురించి కొన్ని మీడియా ఛానల్స్ అబద్ధ వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ తెలిపింది. ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా తన గురించి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయడం పై ఆమె కొన్ని మీడియా ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు రోజుగా మేము వందల


 కొద్ది వ్యక్తులతో మాట్లాడతానని చెప్పుకొచ్చింది. అంతే కాదు వందల కొద్ది వ్యక్తులతో మాట్లాడాలని వార్తలు వస్తున్నాయి. ఆమె దగ్గర ఫోన్ కాల్ లిస్ట్ ఉందని నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అని నిజ నిజాలు ఏంటో నేను నిరూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఆమె వేరే కంట్రీలో ఉందట. ఇక ఈ కేసులో ఆమెకి ఎటువంటి సంబంధం లేదు. అంటూ ఈ సందర్భంగా తెలియజేసింది ఆమె.  ఒక వీడియోను షూట్ చేసి పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈమె తో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిలో నటి సురేఖ అని అలాగే జ్యోతి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: