నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకి పోటీగా ఎటువంటి సినిమాలు అయినా చేస్తూ వారి సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే బాలకృష్ణకి పర్ఫెక్ట్ జోడి అనిపించుకున్న సీనియర్ హీరోయిన్ నయనతార మరొకసారి బాలకృష్ణ తో జతకట్ట పోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయనతార ఏజ్ పెరుగుతున్న కొద్ది క్రేజీ ఆఫర్స్ తో దోసుకుపోతుంది. కోలీవుడ్ లోనే బిజీగా ఉన్న ఈమె తెలుగులో మాత్రం
సీనియర్ హీరోలకు మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా బాలయ్యతో సినిమా అంటే ఎంత బిజీగా ఉన్నా సరే డేట్స్ చేసుకుని మరీ ఆయనతో నటిస్తానని అంటుందట నయనతార. టాలీవుడ్ లో ముఖ్యంగా చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటుంది నయనతార. అయితే తాజాగా మరొకసారి బాలకృష్ణ సినిమాకి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న సమాచారం వినబడుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ 108వ సినిమాని డైరెక్టర్ అనిల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. భగవంత్ కేసరి టైటిల్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు .
అయితే ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. అలా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ మరొక సినిమాని ప్రారంభించాడు. ఇక ఈ సినిమా ఓపెనింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతారను తీసుకున్న సమాచారం వినబడుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా శ్రీరామరాజ్యం జై సింహ వంటి సినిమాలు ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాయో అందరికీ తెలిసిందే .ఇక ఆ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..!!