బాలయ్య బాబు లో ఆ క్వాలిటీ చూసి పెళ్లి చేసుకున్న వసుంధర గారు....!!

murali krishna
నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనను అభిమానించే వాళ్ళు ఎంత ఉన్నారో ఆయన అంటే భయపడే వాళ్ళు కూడా అంతే ఉన్నారని చెప్పాలి.మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న బాలయ్య ఈ తరం ప్రేక్షకులకు కూడా హీరో గానే కనిపిస్తున్నాడు. వయసు మీద పడినా కూడా ఎనర్జీ మాత్రం పెంచుకుంటూనే పోతున్నాడు.వరుస సినిమాలు చేస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు. నిజానికి బాలయ్యకు ఈ వయసులో ఇంత ఎనర్జీ ఉంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఆయస పడకుండా డైలాగులు, ఫైటింగులు, డాన్స్ లు ఇలా ఒకటేమిటి ప్రతి విషయంలో బాలయ్య బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈతరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ మధ్య చేసిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మరిన్ని హిట్టులు కొట్టడానికి లైన్ లో ఉన్నాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కూతుర్ల వయసున్న హీరోయిన్లతో తెలుగు రొమాన్స్ లు చేస్తున్నాడు బాలయ్య. ఇక బాలయ్య సినిమాల విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన పర్సనల్ విషయాలు కూడా చాలామందికి తెలిసే ఉంటుందని చెప్పాలి.

ఆయన వసుంధరను పెళ్లి చేసుకోగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఇక అందులో పెద్దమ్మాయి బ్రాహ్మణి అందరికీ తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు కోడలుగా, బాలయ్య కూతురుగా ఒక హోదాలో ఉంది. ఇక చిన్న కూతురు ప్రస్తుతం చదువుకుంటుంది. ఇక కొడుకును హీరోగా పరిచయం చేయటానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు బాలయ్య. అయితే ఇదంతా పక్కన పెడితే.. చాలావరకు ఆయన భార్య వసుంధర గురించి ఎటువంటి విషయాలు బయటపడవు. బాలయ్య కూడా తన ఫ్యామిలీ విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఎప్పుడో సందర్భం బట్టి కొన్ని కొన్ని విషయాలు బయట పడుతూ ఉంటాయి. అయితే తాజాగా బాలయ్య, వసుంధర లకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. మామూలుగా బాలయ్య, వసుంధర ఇప్పటికీ అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు బాగా ప్రేమలు చూపించుకుంటూ ఉంటారు. అయితే బాలయ్యకు కోపం ఎంత ఎక్కువ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన కోపం చాలాసార్లు మీడియా ముందు చూసాము. అయితే ఈ కోపం ఇప్పటిది కాదు ఆయన పుట్టుకతోనే వచ్చిందని తెలిసింది. ఇక బాలయ్యకున్న కోపాన్ని చూసి చాలామంది ఆయన దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. కానీ ఆయన భార్య వసుంధర ఆయనలో ఉన్న కోపాన్ని చూసే ఇష్టపడిందట. తమ పెళ్లి చూపుల్లో బాలయ్యకు కోపం ఎక్కువ అని కుటుంబ సభ్యులు తెలిపారట. అయినా కూడా ఏమాత్రం భయపడకుండా ఆయనలో ఉన్న కోపాన్ని చూసి ఆయనను ఇష్టపడిందని తెలిసింది. పెళ్లిచూపుల్లో చూసిన ఐదు నిమిషాల్లోనే బాలయ్య అంటే విపరీతమైన ప్రేమ కలిగిందట. ఆయన తనను జీవితాంతం సంతోషంగా చూసుకోగలరు అన్న నమ్మకం కలిగి వెంటనే పెళ్లికి ఒప్పేసుకుందట వసుంధర.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: