బ్రహ్మనందం కొడుకు రోజుకి అంత సంపాదిస్తాడా....??

murali krishna
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రాజా గౌతమ్ తండ్రి నట వారసత్వం తీసుకున్నాడు. 2004లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.దర్శకుడు కే రాఘవేంద్రరావు రాజా గౌతమ్ ను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. రొమాంటిక్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పల్లకిలో పెళ్లి కూతురు పర్లేదు అనిపించుకుంది. కీరవాణి సాంగ్స్ ప్రాచుర్యం పొందాయి. కాబట్టి పల్లకిలో పెళ్లి కూతురు మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. రాజా గౌతమ్ కి ప్రేక్షకులు పాస్ మార్క్స్ వేశారు.పల్లకిలో పెళ్లికూతురు తర్వాత ఆయన కొన్ని చిత్రాలు చేశాడు. అవి అంతగా ఆదరణకు నోచుకోలేదు. పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా రాజా గౌతమ్ కి బ్రేక్ రాలేదు. అడపాదడపా చిత్రాలు చేయడం మాత్రం మానలేదు. అయితే యాక్టింగ్ రాజా గౌతమ్ కి జస్ట్ ప్యాషన్ మాత్రమే అట. ఆయన బిజినెస్ ప్రొఫెషన్ లో గొప్పగా రాణిస్తున్నాడట.
రాజా గౌతమ్ కి పలు కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయట. ఐటీతో పాటు ఎం ఎన్ సీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడట. అలాగే బెంగుళూరులో రెస్టారెంట్స్ ఉన్నాయట. వివిధ వ్యాపారాల ద్వారా రాజా గౌతమ్ నెల సంపాదన రూ. 30 కోట్లకు పైమాటే అట. అంటే రోజుకు కోటి రూపాయలన్న మాట. సినిమాకు వంద కోట్లు తీసుకునే హీరో కూడా ఆ మూవీ పూర్తి చేయడానికి ఏడాది నుండి రెండేళ్ల సమయం కేటాయించాలి. కానీ రాజా గౌతమ్ పని చేసినా చేయకపోయినా రోజుకు కోటి రూపాయల ఆదాయం కలిగి ఉన్నాడు. కాబట్టి రాజా గౌతమ్ ముందు స్టార్ హీరోలు కూడా దిగదుడుపే అని చెప్పొచ్చు. అహనా పెళ్ళంట మూవీతో వెలుగులోకి వచ్చిన బ్రహ్మానందం దశాబ్దాల పాటు తీరిక లేకుండా నటించారు. వందల కోట్ల రూపాయలు సంపాదించారు. అందులోనూ బ్రహ్మానందం ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయడు, ఎవరికీ ఇవ్వడట. డబ్బు విషయంలో అంత నిక్కచ్చిగా ఉంటాడట. తన సంపాదనను కొడుకు వ్యాపారాల వైపు మళ్ళించాడు. బ్రహ్మానందం ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: