టాలీవుడ్ హీరోలంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ కూడా ఇందులో ఉన్నాడు. తెలుగులో చిన్నహీరోగా ఎన్నో హిట్స్ కొట‍్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరో గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అది దైవభక్తి నేపథ‍్యం వున్న మూవీ కావడంతో బాగా ఆడింది. ఇక ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ తో తీసిన 'స్పై' సినిమాలో నటించాడు. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇక స్పై సినిమాలు అనగానే కథ ఎలా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన సూపర్‌స్టార్ కృష్ణ గారి 'గూఢచారి 116' నుంచి అడివి శేష్ 'గూఢచారి' వరకు ఇలాంటి మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఓ ఏజెంట్ ఉంటాడు... రా డిపార్ట్‌మెంట్.. దానికి ఓ చీఫ్.. ఆయన హీరో అనబడే ఏజెంట్‌కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఇక ఫైనల్ గా అది పూర్తి చేసి, విలన్ ని చంపాడా లేదా అనేదే స్టోరీగా ఉంటుంది.సరిగ్గా ఈ టెంప్లేట్‌ని ఉన్నది ఉన్నట్లుగా 'స్పై' సినిమా ఉంటుంది. అసలు ఇందులో కొత్తదనం లేదు.టీజర్, ట్రైలర్ చూసి అంచనాలు పెంచుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో దేశభక్తి అనే పాయింట్ తప్ప ఏమిలేదు. ఇది కూడా రొటీన్ రెగ్యులర్ స్పై తరహా సినిమానే. ఇందులో ఏ మాత్రం కొత్తదనం లేదు. పోనీ యాక్షన్ సీన్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీ కూడా లేదు. చాలా బోరింగ్ గా సినిమా సాగుతుంది.కార్తికేయ, 18 పేజెస్ లాంటి మూవీస్ తో మెప్పించిన నిఖిల్ ఈ సినిమాతో నిరాశ పరిచాడు.