హరిహర వీరమల్లు నుండి మరొక సీనియర్ నటుడు ఔట్..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రెండు సినిమాలకు ఇప్పుడు ఒకటే పరిస్థితి కొనసాగుతోంది. అయితే ఈ రెండు సినిమాలకి ఎటువంటి పోలికలు లేవు. కానీ ఈ రెండు సినిమాలు షూటింగ్ విధానంలో మాత్రం ఒకటే పోలిక ఉంది. ఇదిగో అదిగో అంటూ షూటింగ్ నేను వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ రెండు సినిమాల కి ఒక విషయంలో ఒకేలాగా అనిపిస్తున్నాయి. అయితే గుంటూరు కారం సంగతి పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమా నుండి ఒక సీనియర్ నటుడు బయటికి వచ్చేసారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.


 అయితే ఎందుకు ఎవరు ఏంటి అనేది తెలియదు కానీ.. ఒక సీనియర్ నటుడు అయితే ఈ సినిమా నుండి బయటకు వెళ్లిపోయారు అన్న సమాచారం వినబడుతుంది. అయితే చాలా రోజులుగా అడిగినప్పుడల్లా డేట్స్ కేటాయిస్తూ వస్తున్న అన్నట్టుడు ఓపిక లేక బయటకు వెళ్లిపోయారని  సమాచారం వినబడుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి చాలామంది నటీనటులు బయటకు వెళ్లిపోయారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ పార్ట్ స్టార్ట్ కాకుండా చాలామంది బయటకు వెళ్లిపోయిన వారు సైతం కొన్నారు. కొన్ని కొందరు కొన్ని రోజులు షూటింగ్ అయిన తర్వాత బయటికి వెళ్లిపోయారు.


వెళ్ళింది ఎవరు అనేది తెలియకపోయినా కొత్త నటుడు ఎవరు అనే విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయట.అయితే దాన్నిబట్టి ఈ సినిమాలో ఎవరు బయటకు వెళ్లిపోయారు అన్నది అంచనా వేయొచ్చు. ఈ మధ్య దర్శకుడు సైతం సినిమా నుండి వెళ్ళిపోతారు అన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం దానికి సంబంధించిన ఎటువంటి వార్తలు లేవు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే చాలా నెలల క్రితం మేము మొదలైన ఈ సినిమా నిదానంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. ఇటీవల పవన్ మిగిలిన సినిమాకు డేట్స్ ఇస్తున్నాడు తప్ప ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: