డైరెక్టర్ శంకర్ కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమలహాసన్ ధర తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు .ప్రస్తుతం  రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక అందులో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ ఒకటి అయితే మరొకటి కమలహాసన్ నటించిన ఇండియన్ 2.నిజానికి కమలహాసన్ ఇండియన్ టు సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది .కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పుడు నుండి ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. కాగా లైక ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సూర్య కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్థ ,సముద్రఖని, బాబీ సింహ, వెన్నెల కిషోర్ తదితరులు..
ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సౌత్ ఆఫ్రికాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నీ తెరకెక్కిస్తున్నారు. అయితే మొదట ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో శంకరమని వదిలేసి రాంచరణ్ తో సినిమాని స్టార్ట్ చేశారు .ఇంతలోనే ఇండియన్ టు సినిమా మేకర్స్ శంకర్ ని ఆశ్రయించి చర్చలు జరిపిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టుని చేసే పనిలో పడ్డాడు. ఒకవైపు చరన్ తో సినిమా చేస్తూనే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు శంకర్ .2001లో వచ్చిన ఇండియన్ 2 సినిమా పోతుంది.
ఈ క్రమంలోని ఈ షూటింగ్ కంప్లీట్ చేసిన కమలహాసన్ తాజాగా కొన్ని ప్రధాన సన్నివేశాలను వీక్షించడం జరిగింది. ఇక ఆ సన్నివేశాలు కమలహాసన్ కి బాగా నచ్చాయట. దాంతో వెంటనే డైరెక్టర్ శంకర్ ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ప్రజెంట్ చేశాడు కమలహాసన్. పనేరాయ్ లుమినర్ అనే బ్రాండెడ్ వాచ్ ని శంకర్కు బహుమానంగా ఇచ్చాడు కమలహాసన్. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆయన స్వయంగా అతను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం జరిగింది.ఇక ఈ క్రమంలోనే ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు కమలహాసన్ శంకర్ కి ఇచ్చిన వాచ్ ధర 8.77 లక్షల అని అంటున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: