ప్రాజెక్ట్-K: స్టోరీ లీక్.. జస్ట్ మైండ్ బ్లోయింగ్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా..మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ప్రాజెక్ట్-K'. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పోస్టర్ సినిమాపై చాలా భారీగా అంచనాలని పెంచేసాయి.ఇక ఇదిలా ఉంటే... ఈ సినిమా నుంచి స్టోరి లైక్ లీక్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ మేరకు.. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే 'ప్రాజెక్ట్-K' సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ మూవీ మొదటి భాగంలో ప్రభాస్.. కమల్ హాసన్‌తో పోరాడేందుకు భవిష్యత్తులోకి అంటే 2600 సంవత్సరంలోకి ప్రయాణిస్తాడట. ఇక అందుకు దారి తీసే పరిస్థితులు..ఇంకా ఆ కాలంలోకి ప్రయాణించేందుకు ప్రభాస్ రెడీ కావడంతో మొదటి భాగం ముగుస్తుందట.



ఇక రెండవ పార్ట్ మొత్తం ప్రభాస్ ఇంకా కమల్ మధ్యలో సాగనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ స్టోరి మాత్రం చాలా ఇన్‌ట్రెస్టింగ్‌గా ఉంది. కాగా.. 'ప్రాజెక్ట్-K' సినిమా షూటింగ్ ఇప్పటికే ఏకంగా 70 శాతం పూర్తి అయింది. కాగా ప్రభాస్ ని వరుస భారీ ప్లాపులు వెంటాడుతున్నాయి.వరుస మూడు పాన్ ఇండియా డిజాస్టర్ లని ప్రభాస్ చవిచూసాడు. రీసెంట్ గా విడుదల అయిన ఆదిపురుష్ సినిమా చాలా ఘోరంగా విమర్శల పాలయ్యి అట్టర్ ప్లాప్ అయింది.ఈ సినిమా థియేటర్ రన్ కూడా ముగిసిపోయింది. దీంతో ప్రభాస్ రాబోయే సలార్ ఇంకా ప్రాజెక్ట్ కె సినిమాలపైనే అసలు పెట్టుకున్నాడు. మరి చూడాలి ఈ సినిమాలు ప్రభాస్ కి ఎలాంటి హిట్ ని ఇస్తాయో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: