ఇండియా వ్యాప్తంగా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ధనుష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు సార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. తెలుగులో సార్ అనే పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో వాతి అనే పేరుతో విడుదల అయింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అటు టాలీవుడ్ ... ఇటు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి సందీప్ కిషన్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. సందీప్ పాత్ర ఈ మూవీ లో చాలా కీలకంగా ఉండబోతున్నట్లు ... ఈ మూవీ మొత్తం కథను మలుపు తిప్పే పాత్రలో సందీప్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.