తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి
రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే పోయిన సంవత్సరం డీజె ట్టిల్లు
మూవీ తో మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న
యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సిద్దు జొన్నలగడ్డ గురించి కూడా ప్రత్యేకంగా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రామ్ పోతినేని ...
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
సెప్టెంబర్ 15 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ "టిల్లు స్క్వేర్" అనే
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ ని కూడా
సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం
రాఘవ లారెన్స్ "చంద్రముఖి 2" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం వినాయక చవితి కి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ ని కూడా
సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తే కనుక నిజం అయితే ఈ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలతో
రాఘవ లారెన్స్ "చంద్రముఖి 2"
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడవలసి వస్తుంది.