కెప్టెన్ మిల్లర్.. మూవీ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్..!!

Divya
కోలీవుడ్ హీరో ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అరుణ్ మదేస్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ జూన్ 30వ తేదీన అంటే ఈ రోజున లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. కాగా కెప్టెన్ మిల్లర్ కు సంబంధించిన మరొక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ..అదేమిటంటే ఈ సినిమా ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్ కూడా భారీ మొత్తంలో అమ్ముడుపోయినట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.

రాఖి ,సానికాయుధం వంటి చిత్రాలకు రైటర్ గా పని చేసిన అరుణ్ మదేశ్వర దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్ త్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తోంది.. ఒక విప్లవ యోధుడు కెప్టెన్ మిల్లర్ స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఏకంగా మూడు పార్టీలుగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది..


ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలకమైన పాత్ర లో నటిస్తున్నట్లు సమాచారం.అలాగే సందీప్ కిషన్ ,నివేదిత సతీష్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ టీజర్ ను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్ పోస్టర్ కు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: