తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం పేరు చెప్పగానే ఎక్కడ లేనంత నవ్వు వస్తుంది. అంతలా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటాడు. తరచూ ఏ సోషల్ మీడియాలో చూసినా ఆయనకి సంబంధించిన మీమ్స్ రానే వస్తాయి. ఇక బ్రహ్మానందం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కటి చాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి. అయితే స్క్రీన్ పై కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తాయి. అలా త్రివిక్రమ్ మరియు బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు అంతలా హాస్యాన్ని పండించాయి. అయితే అతడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ సినిమాలోని డైలాగులు కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాయి. ఇక త్రివిక్రమ్ రాసిన సన్నివేశాలు బ్రహ్మానందం చెప్పే డైలాగ్ లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. గత కొంతకాలంగా వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇన్నాళ్టికి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఒక కాంబినేషన్ వస్తుంది అని సమాచారం వినబడుతుంది. జల్సా సినిమాలో కానిస్టేబుల్ లాగా అందరినీ ఆకట్టుకుని ఈ సినిమా విజయానికి దోహదపడ్డాడు బ్రహ్మానందం. తాజాగా ఇప్పుడు మళ్ళీ సన్నాఫ్
సత్యమూర్తి సినిమాలో ఆకట్టుకున్నాడు. అయితే గత కొన్ని నీళ్లుగా వీరిద్దరి కాంబినేషన్ కనిపించకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా రావాలని మళ్లీ అంతలా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలని ఎదురు చూస్తున్నారు బ్రహ్మానందం ఫాన్స్. అయితే తాజాగా ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఇన్ని ఏళ్ల తర్వాత బ్రహ్మానందం కోసం ఒక పాత్రని అనుకున్నారట త్రివిక్రమ్. అంతేకాదు స్క్రిప్ట్ మార్పులో భాగంగా మహేశ సూచన మేరకే త్రివిక్రమ్ గుంటూరు కాలం సినిమాలో ఆయన పాత్రని ఎంపిక చేశారన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. అయితే మహేష్ బాబు కోసం బ్రహ్మానందం ఈ సినిమాలో నటిస్తారా లేదా అన్న విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఒకవేళ ఈ వార్త గనక నిజమైతే మహేష్ బాబు బ్రహ్మానందం త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాలో ఎంతటి ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయో చూడాల్సి ఉంది..!!