మరో కొత్త కారు కొన్న నాగార్జున.. రేటు తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మన్మధుడిగా అమ్మాయిలు కలల రాకుమారుడు గా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. 63 ఏళ్ల వయసులో కూడా అంతే ఫిట్నెస్తో అంతే యంగ్ గా కనిపిస్తూ యంగ్ హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ దోచుకుపోతున్నాడు నాగార్జున. కుర్ర హీరోలకి పోటీ పడుతూ సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. అయితే ఇతను ఇద్దరు కొడుకులు సైతం సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు.

అయినప్పటికీ అదే ఫిట్నెస్ తో అంతే యంగ్ గా కనిపిస్తాడు నాగార్జున తన ఇద్దరు కొడుకుల కంటే మించిన అందం ఫిట్నెస్ తో అందరినీ ఆకర్షించుకుంటాడు. ఇక నాగార్జున లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా హుందాగా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు నాగార్జున. అయితే నాగార్జున కార్ గ్యారేజ్ లో చాలా రకాలు కారులు ఉంటాయి. అటు నాగచైతన్యకు కూడా కార్లు అంటే చాలా పిచ్చి. ఆయన దగ్గర కూడా ఎన్నో రకాల కార్లు ఉన్నాయి. అయితే తాజాగా కింగ్ నాగార్జున ఒక ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం జరిగింది.

కియా ఈవీ 6 కారుని కొన్నాడు నాగార్జున. అయితే వాటికి సంబంధించిన ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కొత్త కారును కేవలం నాలుగున్నర నిమిషాలు మాత్రమే చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చట. ఈ క్రమంలోనే ఈ కారు ధర  ఆరా తీస్తున్నారు నేటిజన్స్. ఈ క్రమంలోనే ఈ కారు ధర 60 నుండి 70 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో నాగార్జున కొత్తగా కొనుగోలు చేసిన ఈ కారుకి సంబంధించిన ఫోటోలు కాస్త ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆయన నటించిన బ్రహ్మహస్త్ర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత నాగార్జున మరొక కొత్త సినిమాని ఇంకా అనౌన్స్ చేయలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: