ప్రతిబిగల నటులు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇలా అలాంటి వారిలో యోగి బాబు కూడా ఒకరు. స్టార్ కమెడియన్గా తమిళం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఈయన. కమెడియన్ గా చేసిన సినిమాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా నటిస్తూ ఉంటాడు యోగి బాబు. అంతేకాదు ప్రత్యేకంగా ఆయన కోసమే కథలో ఒక కామెడీ ట్రాక్ను రాస్తూ ఉంటారు దర్శకులు. దీంతోనే అర్థం చేసుకోవచ్చు ఆయన కామెడీకి ఎంతటి ప్రత్యేకత ఉందో. ఇక దళపతి విజయ్ నటిస్తున్న సినిమాల్లో యోగి బాబు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. అయితే యోగి బాబుకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అదేంటంటే ఆయన ఒక్క సినిమాకి గాను తీసుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2009లో వచ్చిన యోగి సినిమాతో పరిచయమయ్యాడు ఈయన. ఇక ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి సైతం డబ్ అయ్యాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ వరుణ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు ఈ స్టార్ కమెడియన్. ఇక ఆ సినిమాలో ఆయన చేసిన కామెడీ ఈ సినిమాకి ఎంతలా ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతోపాటు కేవలం ఆయన కామెడీ కోసమే ఈ సినిమాని చూసిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఇటీవల వచ్చిన లవ్ టు డే సినిమాలో సైతం ఆయన కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఇక ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఇప్పుడు యోగి బాబు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విని అందరూ షాక్ అవుతారు. అంతేకాదు ఇప్పుడున్న చాలామంది హీరోలు అందుకునే రెమ్యూనరేషన్తో సమానంగా ఈ స్టార్ కమెడియన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈయన ఒక్కొక్క సినిమాకి గాను కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటాడట .ఒక్క రోజుకి 18 లక్షల వరకు తీసుకుంటాడట ఆయన. అయితే కోలీవుడ్ నుండి సమాచారం మేరకు రోజు 18 లక్షలు అందుకుంటూ దాదాపు ఒక సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇప్పుడున్న యంగ్ హీరోలు తీసుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు..!!