దేవర పార్ట్ 1 కాకముందే పార్ట్ 2 స్టార్ట్ చేసిన డైరెక్టర్ కొరటాల ..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నాలుగు షెడ్యూల్స్ పూర్తి కాగా పవర్ఫుల్ ప్యాక్ కథతో ఈ సినిమాని తీస్తున్నారు. కాగా ఈ సినిమాని పాత ఎన్టీఆర్ లెవెల్లో విడుదల చేయబోతున్నాడు కొరటాల. ఇక జూలై మూడు నుండి ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయడం విశేషం. 
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలోని యాక్షన్స్ సీన్స్ కోసం దేవర మేకర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరాని వాడుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు సినిమా గురించి కొత్త కొత్త అప్డేట్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన ఒక కొత్త అప్డేట్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలో ఆయన అదుర్స్ ఆంధ్రావాలా నా అల్లుడు వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్లో కనిపించాడు.
కాగా ఈ సినిమాలో  సైతం పార్ట్ 2 కి సంబంధించిన లీడ్ ఉంటుందని దాంతోపాటు కొరటాల శివ దానికి తగ్గట్లుగా స్టోరీని సైతం డిజైన్ చేసేసాడు అన్న వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు స్క్రిప్ట్ కోసమే ఆరేళ్లు శ్రమించిన ఆయన ప్రీ ప్రొడక్షన్ కోసం మరో రెండేళ్ల సమయం కేటాయించి పక్క ప్లానింగ్ తో తీస్తాడట. మొత్తానికి ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆనందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: