యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్,
శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన
సినిమా 'భారతీయుడు'. ఈ చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు
శంకర్ సీక్వెల్ తీస్తున్నారు.ఈ మూవీని
తమిళ్ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ
మూవీ గురించి ఆయన మాట్లాడుతూ.. "ఇండియన్ 2 కోసం షూట్ చేసిన కొన్ని సీన్లు ఇప్పుడు ఉపయోగించడం లేదు. వాటితో
ఇండియన్ 3
సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు" అన్నారు. మరోవైపు ఈ సినిమాలోని మేజర్ సీన్స్ చూసిన కమలహాసన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.ఇంకా అంతేకాదు,
శంకర్ కు ఖరీదైన వాచ్ ను
గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ఈ వాచ్ ధర సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దీనిపై
శంకర్ ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ఈ
సినిమా అవుట్ పుట్ విషయంలో శంకర్ తో పాటూ కమల్ హాసన్ కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు.
ఇదిలా ఉంటే ఈ
సినిమా రిలీజ్ గురించి కొన్నాళ్లుగా సస్పెన్స్ నెలకొనగా ఇప్పుడు ఓ క్లారిటీ తెలుస్తోంది. ఇండియన్2
సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చని సమాచారం.ఈ
మూవీ వచ్చే సమ్మర్ రేస్లో నిలవనుందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ఇక 'భారతీయుడు 2' చిత్రంలో కాజల్,
రకుల్ ప్రీత్ సింగ్,
సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ
సినిమా గురించి ఓ మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.
ఇండియన్ 2
సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని, ముఖ్యంగా పొలిటికల్ పంచ్ డైలాగ్స్ బాగా పెలతాయి అని సమాచారం తెలుస్తుంది. ఈ
సినిమా షూట్ కూడా దాదాపు కంప్లీట్ అయ్యిందట.'ఇండియన్ 2' (భారతీయుడు 2) నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, విజువల్స్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటుండగా.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు ఉదయనిది స్థాలిన్.