ఆ కారణంతో సింహాన్ని దత్తత తీసుకున్న హీరో....!!
ఇక అదే జూ కి చెందిన ప్రకృతి అనే ఏనుగును కూడా గతంలో 6 నెలలపాటు నటుడు దత్తత తీసుకున్నాడు. 2020లో కూడా ఓ తెల్లపులిని శివకార్తికేయన్ దత్తత తీసుకున్నాడు. ఏడాదిపాటు దాని సంరక్షణ కోసం రూ. 2.15 లక్షలు చెల్లించాడు. మూగ జీవాల సంరక్షణ బాధ్యతలు తీసుకొంటున్న శివకార్తికేయన్ మంచి మనసులు పలువురు అభిమానిస్తున్నారు.ఇక ల విషయానికొస్తే.. నటుడు శివకార్తికేయన్ ప్రస్తుతం మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మావీరన్లో నటిస్తున్నాడు. ఈ మువీ జూలై 14న విడుదల కానుంది. ఈ మువీ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ నిర్మిస్తున్న మరో చిత్రంలో శివకార్తికేయన్ నటించనున్నారు.ఐతే శివ కార్తికేయన్ చేసిన ఈ పనికి కోలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇండస్ట్రీ వర్గాలే కాకుండా ఆయన అభిమానులు కూడా ఆయన చేసిన పనులకు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.శివ కార్తికేయన్ ముందు ముందు మంచి మంచి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.