రామ్ చరణ్ కూతురికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన శర్వానంద్..!?

Anilkumar
ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. రాంచరణ్ భార్య ఉపాసన 20వ తేదీన  ఆడబిడ్డకు జన్మనిచ్చింది  పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం తమ బిడ్డతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. అలాగే శుక్రవారం మెగా లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుకను జరుపుతున్నారు. మెగా కుటుంబం ఎందుకు మెగా కాంపౌండ్ లో ఏర్పాట్లు సైతం అంగరంగ వైభవంగా  జరుగుతున్నాయి. అయితే తాజాగా


 ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూతురి కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఒక స్పెషల్ గిఫ్ట్ పంపినట్లుగా తెలుస్తోంది. రాంచరణ్ మరియు శర్వానంద్ ఇద్దరు తమ చిన్నతనం నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. మెగా ఫ్యామిలీతో కూడా శర్వానంద్ బాగా కలుపుగోలుగా ఉంటాడు. అంతేకాదు ఇటీవల జరిగిన శర్వానంద్ పెళ్లి మరియు రిసెప్షన్ వేడుకల్లో సైతం రామ్ చరణ్ మరియు ఉపాసన ఇద్దరు సందడి చేయడం జరిగింది.


తాజాగా శర్వానంద్ తన ఫ్రెండ్షిప్ ను మరోసారి చాటుకున్నాడు. రామ్ చరణ్ కూతురి కోసం ఒక ఖరీదైన బ్రాండెడ్ బేబీ ప్రొడక్ట్స్ గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు పాపకు దుస్తులు బొమ్మలు సైతం పంపించాడట శర్వానంద్. ఇక చిన్నారి కోసం లక్ష్మీదేవి లాకెట్ ఉన్న గోల్డ్ చైన్ సైతం గిఫ్ట్ గా పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే శర్వానంద్ పంపించిన ఈ సప్రైజింగ్ గిఫ్ట్ని చూసి రాంచరణ్ ఉపాసన దంపతులు చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ మరియు శర్వానంద్ ల స్నేహం ఎంత స్ట్రాంగ్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: