యూట్యూబ్ వీడియోలు ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సుమంత్ ప్రభాస్ తాజాగా మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ... ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా తోనే ఈ నటుడు వెండి తెరకు పరిచయం అయ్యాడు. అలాగే ఈ మూవీ తోనే దర్శకుడిగా ఈయన మొదటి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సుమంత్ ప్రభాస్ సరసన సారియా హీరోయిన్ గా నటించింది.
ఈ మూవీ ఈ సంవత్సరం మే 26 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా కట్టుకోవడంతో ఈ మూవీ పర్వాలేదు అనే అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. అలా పర్వాలేదు అని రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను చూడాలి అనుకుంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.