ధనుష్ "కెప్టెన్ మిల్లర్" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆఖరుగా ధనుష్ "సార్" అనే సినిమాలో హీరోగా నటించాడు.


ఈ మూవీ ని తమిళ ... తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో సార్ అనే పేరుతో విడుదల కాగా ... తమిళ్ లో వాతి అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు ... తమిళ బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు కెప్టెన్ మిల్లర్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సందీప్ కిషన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.


ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ధనుష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ చేతిలో ఒక పెద్ద గన్ను పట్టుకొని నిలుచొని ఉన్నాడు. ఆయన పక్కన శవాలు చాలా ఉన్నాయి.  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: