బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఆఖరుగా పఠాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసి ఈ సంవత్సరం
హిందీ సినీ పరిశ్రమలో భారీ
బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన
మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
హీరో జవాన్ అనే మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో షారుక్ సరసన నయన
తార హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ...
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి
అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో
ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అలాగే ఈ
మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ
మూవీ యొక్క టీజర్ ను జూలై 7 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను ప్రముఖ
ఆడియో సంస్థలలో ఒకటి అయినటువంటి టి సిరీస్ సంస్థ 36 కోట్ల భారీ గేయంతో కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ
మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్
డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీపై
హిందీ ...
తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.