మహేష్ కి కృతజ్ఞతలు తెలిపిన దుల్కర్ సల్మాన్.. కారణం..!!
ఇలా ఎన్నో చిత్రాల లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ సీతారామం చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించారు. తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైన దుల్కర్ ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కింగ్ ఆఫ్ కోట అనే టైటిల్ తో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.ఈ క్రమంలోని ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది.
తెలుగు సినిమా టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా రిలీజ్ చేశారు.మలయాళం లో దుల్కర్ తండ్రి మమ్ముట్టి రిలీజ్ చేయగా తెలుగులో మహేష్ రిలీజ్ చేయడం తో పాటు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు మహేష్ బాబు.. అయితే దుల్కర్ సల్మాన్ మరొకసారి ఆకట్టుకొని సినిమా చేయబోతున్నారంటూ మహేష్ బాబు ట్వీట్ చేయగా.. ఈ విషయంపై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ మహేష్ కు థాంక్స్ చెప్పాడు.. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ కూడా మహేష్ కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది దీంతో అభిమానులు సైతం తెగ ఆనందాన్ని తెలియజేస్తున్నారు.