"కీడా కోలా" మూవీ రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ముందుకు సాగిస్తున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ... ఆ తర్వాత దర్శకత్వం వహించిన మరో మూవీ తోను మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా ... నటుడిగా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్న వారిలో ఒకరు తరుణ్ భాస్కర్ ఒకరు.
 


ఇది ఇలా ఉంటే తరుణ్ భాస్కర్ "పెళ్లి చూపులు" "ఈ నగరానికి ఏమైంది" మూవీ లకు దర్శకత్వం వహించి ఈ రెండు మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు "కీడా కోలా" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా ఈ దర్శకుడు రూపొందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ... దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది.


తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సురేష్ ప్రొడక్షన్ సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: