రెండు రోజుల్లో "సామజవరగమన" మూవీకి వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీ విష్ణు ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు సామజవరగమన అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నరేష్ ... వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించగా ... రామ్ అబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.


ఈ మూవీ ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం. ఈ మూవీ రెండు రోజుల్లో నైజాం ఏరియాలో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... సీడెడ్ ఏరియాలో 14 లక్షలు , ఈస్ట్ లో 11 లక్షలు , వేస్ట్ లో 7 లక్షలు ,  గుంటూరు లో 10 లక్షలు ,  కృష్ణ లో 11 లక్షలు ,  నెల్లూరు లో 6 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్  ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.48 కోట్ల షేర్ ... 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని రెండు రోజుల్లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.


ఇకపోతే మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 2.18 కోట్ల షేర్ ... 4.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 3.50 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 1.32 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: