2024: సంక్రాంతి రేసులో ఇన్ని సినిమాలా..?
ముందుగా 2024 సీజన్లో రాబోతున్నామని తెలియజేసిన చిత్రాలలో ప్రాజెక్ట్-K సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాని కూడా జనవరి 13 న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది.. ఈమధ్య రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చిరంజీవి కళ్యాణ్ కృష్ణ మూవీ కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే కాకుండా తాజాగా హనుమాన్ సినిమాని కూడా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్‌గా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది.నాని 30వ సినిమా.. విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి ఇన్ని సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉంటే బాక్సాఫీస్ వద్ద మామూలుగా సందడి ఉండదని పలువురిసిన విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.. మరి సంక్రాంతి బరిలో ఏ సినిమాలు ఉంటాయో లేవో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.