రామ్ - పూరీ కాంబో సినిమా.. బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ డైరెక్టర్గా పేరుపొందిన పూరి జగన్నాథ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే తన కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని డైరెక్టర్గా నిలబడ్డారు. కానీ లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా పూరి కెరియర్ మలుపు తిరిగింది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు ,బయ్యర్లు తమ చాలా నష్టపోయామని ధర్నాకు దిగడంతో పాటు తమ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడంతో ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. అంతేకాకుండా పూరి జగన్నాధ్ తరువాత సినిమాలకు ఇబ్బంది కలిగెల చేస్తామంటూ కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది

పూరి జగన్నాధకు అవకాశం ఇవ్వడానికి హీరోలు నిర్మాతలు సైతం భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు పూరి జగన్నాథ్ హీరో రామ్ కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఏకంగా  రూ.40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా థియేటర్లో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. గతంలో రామ్ ,బోయపాటి కాంబినేషన్లో కూడ ఒక చిత్రం రాబోతున్నది. ప్రస్తుతం హీరో రామ్ తన చిత్రాలన్నీ కూడా స్టార్ డైరెక్టర్లతోనే దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో రామ్ ఒక చిత్రానికి రూ .15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథ పైన ప్రత్యేక దృష్టి పెట్టలని ఫాన్స్  కోరుకుంటున్నారు.పూరి జగన్నాథ్ మళ్లీ  రూ.40 కోట్ల రూపాయలతో సినిమా నిర్మిస్తూ ఉండడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. పూరి జగన్నాథ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్ప వచ్చు. పూరిని అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి మంచి విజయాలని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: