పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు కలిసి ప్రస్తుతం "బ్రో" అనే సినిమాలో హీరోలుగా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ తమిళంలో ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ యొక్క ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని "బ్రో" మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కి కథ ... కథనాలు తెలుగు సినీ ప్రేమికులకు నచ్చే విధంగా అనేక మార్పులను చేర్పులను చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో సాయి తేజ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కేతీక శర్మ హీరోయిన్ గా కనిపించబోతుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఫారాన్ లో సాయి తేజ్ ... కేతిక శర్మ లపై అదిరిపోయే ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మొత్తం పనులు పూర్తి కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ టీజర్ విడుదలైన 24 గంటల్లో 20.50 మిలియన్ వ్యూస్ ను ... 491 కే లైక్స్ ను సాధించింది. ఇది ఇలా ఉంటే "బ్రో" మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.