సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వస్తున్న సంగతే మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ముహూర్తం కూడా ఇంకా జరగలేదు. కానీ ఇప్పటికే వీరలెవెల్లో వారిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై వారి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అంతేకాదు ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్ చెప్పి సినీ అభిమానుల్లో ఊహించని అంచనాలను పెంచేసాడు. పైగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు ఎంత రచ్చ చేస్తున్నరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఇప్పుడు రాజమౌళి రేంజ్ హాలీవుడ్కు చేరింది. ఆయన సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకుల కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ ప్రేక్షకుల సైతం ఎంతో చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీలో మహేష్ బాబు చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు. అంతేకాదు ఎక్కువ రిస్క్ చేయడానికి ముందడుగు వేయడు.
కానీ రాజమౌళి సినిమా కోసం కండలు పెంచుతూ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ నిత్యం అక్కడే కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన జిమ్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు శనివారం జిమ్లో వర్కర్స్ చేస్తున్న వీడియోను తమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాదు నా ఫేవరెట్ స్కిల్ మిల్ ఫినిషర్ తో నా శనివారం మొదలైంది .ఒక నిమిషం ల్యాండ్ మై ప్లేస్ ఒక నిమిషం ల్యాండ్ మైన్ ప్రెస్ ఒక నిమిషం కెటిల్ బెల్ స్వింగ్ ఒక నిమిషం స్కిల్ మిల్ పూర్తి చేశాను అంటే ఒక వీడియోను చెప్పాడు..!!