ఇప్పటికే నాకు రెండు బ్రేకప్ లు అయ్యాయి.. మృణాల్ ఠాకూర్..!?

Anilkumar
టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన మృణాలు ఠాగూర్ పేరు ఇప్పుడు నేషనల్ వైట్ గా వినిపిస్తోంది.  ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. ఇక సీతారామం సినిమాతో ఒకసారిగా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇటీవల ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ టు సినిమా సైతం విడుదలైంది. ఇక ఇందులో ఎవరు ఊహించిన విధంగా రెచ్చిపోయింది ఈ అందాల తార. ఇక ఈమెలో ఇంత బోల్డ్ నెస్ ఉందని ఈ సినిమా చూసే వరకు ఎవరికీ తెలియదు.


 కానీ కుర్రకారులకి మత్తెక్కించేలా నటించింది ఈమె. అయితే లస్ట్ స్టోరీస్ టు ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వాటిలో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే తనకి సంబంధించిన చాలా విషయాలను బయటపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈమె. అంతేకాదు ఇవాళ రేపు కుర్రకారులకు శృంగారం గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పింది. అయితే తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. అయితే నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది..


అతను చాలా అందంగా ఉంటాడు.. ఆ వయసులో పెద్దగా మెచ్యూరిటీ లేదు.. అంతేకాదు వెంటనే ఏమీ తెలియక నేను కూడా ఒకే చెప్పేశాను.. సినిమాల్లోకి రాకముందు కొన్ని రోజులు అతనితో బాగానే ఉన్నాను.. కానీ టెన్త్ అయిపోయిన తర్వాత నేను పై చదువుల కోసం ముంబై వెళ్ళిపోయాను.. దాంతో అతను నాకు దూరమయ్యారు.. సినిమాలోకి రాకముందు మరో వ్యక్తితో లవ్ లో ఉన్నాను.. కానీ అది కూడా బ్రేకప్ అయిపోయింది.. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను.. అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సీతగా ఎంతో అందంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈమె ఇప్పటికే ఇద్దరితో బ్రేకప్ చేసుకోవడంతో ఈ వార్త విన్న వారందరూ షాక్ అవుతున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: