ఈ నగరానికి ఏమైంది: బన్నీ, తారక్ రికార్డులు ఔట్?

Purushottham Vinay
ఇక రీ రిలీజ్ కలెక్షన్స్‌లో ఈ నగరానికి ఏమైంది సినిమా ఒక రేంజ్ లో దుమ్మురేపింది. రిలీజ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. రీ రిలీజ్‌లో మొదటిరోజు ఏకంగా కోటి పైగా కలెక్షన్స్ దక్కించుకొని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.2018 వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్‌టైమ్‌లో ఫస్ట్ డే  70 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.కానీ రీ రిలీజ్‌లో మాత్రం అంతకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. శుక్రవారం నాడు హైదరాబాద్‌తో పాటు మెయిన్‌సిటీస్‌లోని ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ షోస్ చాలా వరకు హౌజ్‌ఫుల్ అయినట్లు సమాచారం తెలుస్తుంది.ఫస్ట్ రిలీజ్ టైమ్‌లో యావరేజ్ టాక్‌ను మూటగట్టుకొన్న ఈ సినిమాకి ఐదేళ్ల తర్వాత రీ రిలీజ్ లో మొదటిరోజే కోటి పైగా వరకు కలెక్షన్స్ రాబట్టడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగులో రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఒకటిగా ఈ నగరానికి ఏమైంది సినిమా నిలిచింది.



రీ రిలీజ్ సినిమాల్లో అల్లు అర్జున్  దేశముదురు, ఎన్టీఆర్ సింహాద్రి సినిమాల రికార్డులను ఈ నగరానికి ఏమైంది ఈజీగా బ్రేక్ చేసింది. రీ రిలీజ్‌లో 2 కోట్ల మార్క్ ని అందుకొని పవన్, మహేష్, రామ్ చరణ్ సినిమాల సరసన చేరింది. ఇప్పటిదాకా పోకిరి, ఒక్కడు, ఖుషి, జల్సా, ఆరంజ్ సినిమాలు మాత్రమే 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయి.ప్రేమ, ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.ఈ సినిమాలో సుశాంత్‌రెడ్డి, విశ్వక్‌సేన్‌, అభినవ్ గోమటం ఇంకా వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలను పోషించారు. ఫస్ట్ రిలీజ్ కంటే సెకండ్ రీరిలీజ్ లో ఈ సినిమా ఇంకా మంచి లాభాలని తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: