తొలిప్రేమ రీరిలీజ్: నిర్మాత, బయ్యర్లకు భారీ లాభాలు?

Purushottham Vinay
ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.అందులో పలు సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి, పలు సినిమాలు కనీస స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టలేక తీవ్ర నష్టాలను మిగిలించాయి. పాత సినిమాని 4K కి మార్చాలి అంటే కచ్చితంగా 20 లక్షల రూపాయిల దాకా ఖర్చు అవుతుంది. ఇక రీసెంట్ గా విడుదలైన తొలిప్రేమ సినిమాకి కూడా అంతే ఖర్చు అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిల్చిన ఈ సినిమాని రీసెంట్ గా చాలా గ్రాండ్ గా విడుదల చేసారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  సునామి లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు స్పీడ్ గా దూసుకు పోతుంది. అసలు ఈ సినిమాకి మొదటి రోజే ఏకంగా కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయట. అసలు ఎలాంటి ప్రొమోషన్స్ లేకుండా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇదే ఊపుని రెండవ రోజు కూడా ఈ సినిమా కొనసాగించింది.


రెండవ రోజు ఈ సినిమాకి 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం తెలుస్తుంది. అందులో కేవలం హైదరాబాద్ సిటీ నుండే ఏకంగా 20 లక్షల రూపాయిలు వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది.అలాగే ఈ రోజు కూడా ఈ సినిమాకి అన్నీ ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. అలా మొత్తం 20 లక్షల రూపాయిల ఖర్చు తో ఈ సినిమా మూడు రోజుల్లో రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇప్పుడు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమా లేకపోవడం తో మరో వారం రోజులు ఈ చిత్రానికి వసూళ్లు వస్తూనే ఉంటాయని అంటున్నారు.అలా మొత్తం మీద ఈ సినిమా ఫుల్ రన్ లో 3 కోట్ల రూపాయిల గ్రాస్ ఇంకా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీనితో నిర్మాతకు ఏకంగా 80 లక్షల రూపాయిలు మిగిలుతుందట.అలాగే బయ్యర్లు కూడా భారీగా లాభాలు పొందడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: