ఎన్నికలను టార్గెట్ చేస్తూ యాత్ర 2 !

Seetha Sailaja
ప్రస్థుతం సినిమాలలో సీక్వెల్ సీజన్ నడుస్తోంది. ‘బాహుబలి’ ‘కేజీ ఎఫ్’ ‘పుష్ప’ సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ మంచి ఘనవిజయాన్ని సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి సక్సస్ ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ తీసే విషయం పై ఉంది. అయితే బయోపిక్స్ కు సంబంధించి కూడ సీక్వెల్స్ తీయవచ్చు అనే విషయాన్ని దర్శకుడు మహీ వి రాఘవ్ నిరూపించబోతున్నాడు.


గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఈదర్శకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పై ‘యాత్ర’ సినిమాను తీసి అప్పట్లో ఒక సంచలనం క్రియేట్ చేశాడు. వైఎస్ ఆర్ పాత్రలో మమ్ముట్టి నటన విషయంలో కనపరిచిన పరిపక్వత అప్పట్లో అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వైఎస్ ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్ష నాయుకుడుగా ఉన్న రోజులలో చేపపట్టిన సుధీర్ఘ పాదయాత్రను హైలెట్ చేస్తూ ‘యాత్ర 2’ త్వరలో రాబోతోంది.


వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదల అని తెలుస్తోంది. ‘‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’’ అనే డైలాగును ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో వాడారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జగన్ చేపపట్టిన పాదయాత్ర ఒక సంచలనం. ఈ పాదయాత్రలో జగన్ పడిన కష్టం చేసిన త్యాగం ప్రజలకు మరొక్కసారి ఎన్నికల ముందు గుర్తుకు చేసే విధంగా ఈ ‘యాత్ర 2’ ను నిర్మిస్తున్నారు.


తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ పేదల కన్నీళ్లు తుడవాలనే సంకల్పంతో చేపట్టిన అప్పటి జగన్ పాదయాత్రకు సంబంధించిన కీలక ఘట్టాలు ఈ ‘యాత్ర 2’ లో ఉంటాయని తెలుస్తోంది. అప్పట్లో జగన్ చేసిన పాదయాత్ర దేశంలోనే అత్యంత దూరం నడిచిన యాత్రగా రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఒక యాత్రకు సంబంధించి సినిమా తీయడం ఒక సాహసం అయితే ఇప్పుడు ఏకంగా దానికి సీక్వెల్ తీయడం మరింత సంచలనం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: