సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె పాడిన పాటలు వింటూ ఉంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇక ఈమె పాటలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ లో దాదాపు హీరోయిన్లకు ఉన్న సింగర్ సునీతకి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు సింగర్ గానే కాకుండా చాలామంది టాప్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది సునీత. ప్రస్తుతం ఈమె వాయిస్ కి చాలా డిమాండ్ ఉంది ఎన్నో విజయవంతమైన టాప్ మోస్ట్ హిట్ సాంగ్స్ పాడింది సునీత.
అయితే తాజాగా ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేలవుతుంది. అదేంటంటే తన కొడుకు కోసం ఎవరు చేయలేని త్యాగాన్ని చేయడానికి సిద్ధమైందట సునీత. ఇక అసలు విషయం ఏంటంటే సింగర్ సునీత కొడుకు ఆకాష్ ని హీరోగా పరిచయం చేయడానికి రెడీ అయ్యిందట సునీత. ఈ క్రమంలోనే లెజెండ్రి ఫిలిం మేకర్ కే రాఘవేంద్రరావు బ్యానర్ ఆర్కే తెలుగు ఫిలిం షో ప్రొడక్షన్లో ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి అనే కొత్త సినిమాని నిర్మించబోతున్నారట. శేఖర్ గంగ మౌని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
పిరియాడిక్ గా డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రానందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ని సైతం విడుదల చేయడం జరిగింది. థియేటర్ ఆర్టిస్ట్ భావన వజపండల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి సైతం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక సింగర్ సునీత తన కొడుకు కోసం చేసిన ఈ గొప్ప పనికి సంబంధించిన వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!