తంళన్: భారీగా పెరిగిన హైప్.. అంత కంటెంట్ ఉందా?
ఆస్కార్‌తో సహా మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడగు వేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నీలం ప్రొడక్షన్ హౌస్ సీఈఓ ధనంజయన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.తంగళన్ సినిమాని ఆస్కార్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. యూనివర్సల్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ కేవలం మరో 10 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇదిలా ఉంటే తంగళన్ మూవీని 2024లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టులో తంగళన్ మూవీని ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ చేయనున్నారు. ఆస్కార్ రేసులో ఈ సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక 2డీతో పాటు 3డీ వెర్షన్‌లోనూ విడుదల చేయనున్న ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.చూడాలి ఇక ఈ సినిమా అనుకున్న రేంజ్ కి వెళుతుందో లేదో..