టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన కేవలం సినిమాల్లో హీరో పాత్రల్లో నటించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి వాటితో ఎన్నో విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాతగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కేవలం తాను నటించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాకుండా కొన్ని బయట సినిమాలు కూడా నిర్మాతగా వ్యవహరించాడు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ కి కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ "అమిగోస్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఈ నటుడు త్రిపాత్రాభ్యాంలో నటించాడు. బింబిసార లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.
అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయి న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని జూలై 9 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై జెమినీ సంస ప్రసారం చేయనుంది. మరి ఈ మూవీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.