మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితమే వాల్తేరు వీరయ్య మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఇంతకాలం పాటు భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... మహతీ స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
కీర్తి సురేష్ ... సుశాంత్ ఈ మూవీ లో కీలక పాత్రల్లో కనిపించనుండగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే భోళా శంకర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న చిరంజీవి తన తదుపరి మూవీ ని కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది చిరంజీవి తన తదుపరి మూవీ ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు ... ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.