ఆ విషయంలో చాలా స్పీడ్ మీదున్న ప్రభాస్...!!
రీసెంట్గా 700 కోట్లతో ఆది పురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఒకవైపు ట్రోల్స్ ఎదుర్కొంటూనే మరోవైపు మంచి వసూలు సొంతం చేసుకుంటుంది. హీరోగా ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇక వ్యక్తిగతంగా కూడా ఈయన మనస్తత్వం చాలా మంచిదని ఈయనతో నటించిన నటీనటులు బాగా చెబుతూ ఉంటారు. ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారికి భోజనం పెట్టకుండా ఉండలేడు. ఇక ఈయనకు మంచి మనస్తత్వం ఉంది కాబట్టే ఈయనకు అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఈయన సినిమాలు సక్సెస్ కాలేకున్న కూడా తన ఫ్యాన్స్ వల్ల కూడా సినిమాకు మంచి వసూలు వస్తుంటాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన మరో రెండు సినిమాలలో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి సలార్ మూవీ. ఇక ఆయన అభిమానులు అంత ఈ సినిమాపై బాగా అంచనాలు పెంచుకున్నారు. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఏదైనా షాపింగ్ కు వెళ్తే అక్కడ ఐదు నిమిషాలలో 150 డ్రెస్సులు కొంటాడట. గతంలో ఈయన మంచు లక్ష్మి హోస్ట్ చేసిన ఓ షోలో కూడా పాల్గొని తన షాపింగ్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు.
తను షాపింగ్ చక చక చేస్తుంటాను అని.. ఈ షాప్ లో బిల్లు కట్టేసేలోపు మరో షాపులో కూడా బట్టలు తీసుకుంటాను అని.. తనవాళ్లు నచ్చి తీసుకోమని చెప్పినా కూడా ఆ తర్వాత చూసుకుంటాలే అని వదిలేసి అన్ని తీసుకుంటాను అని తెలిపాడు. అంటే ప్రభాస్ కు ఒక వస్తువు నచ్చితే దాని గురించి ఏది ఆలోచించకుండా వెంటనే తీసుకుంటాడు అని అర్థమవుతుంది.