సుమ పెళ్లి విషయంలో అలా ఆలోచించిన రాజీవ్ కనకాల....!!

murali krishna
సుమ,రాజీవ్ కనకాల టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ జోడీలలో ఒకటనే సంగతి తెలిసిందే. సుమ రాజీవ్ లలో ఎవరి టాలెంట్ ను తక్కువగా అంచనా వేయలేము.బుల్లితెర పై సుమ సత్తా చాటుతుండగా వెండితెరపై రాజీవ్ కనకాల సత్తా చాటారు. రాజీవ్ కనకాల పాత్ర ఏ సినిమాలో చనిపోతే ఆ సినిమా హిట్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. విరూపాక్ష మూవీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజీవ్ రోల్ కు మంచి మార్కులు పడ్డాయి. రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్న భాగ్ సాలె సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో రాజీవ్ కనకాల మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుమ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో రాజీవ్ మాట్లాడుతూ తాను పెళ్లికి ముందు సుమను లేకపుకుపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు.

సుమ పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోలేదని ఆయన కామెంట్లు చేశారు. ఆ తర్వాత సుమ పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోవడంతో ఆమెను లేపుకుపోవాల్సిన అవసరం రాలేదని రాజీవ్ కనకాల కామెంట్లు చేశారు. ఆ తర్వాత సుమ భాగ్ సాలె సినిమాను ఎందుకు చూడాలని అడగగా కాల భైరవ వెంటనే ఈ సినిమాలో రాజీవ్ కనకాల చచ్చిపోరని బ్రతికే ఉంటారని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ ప్రణీత్ రాజీవ్ కనకాలతో మీరు ఈ సినిమాలో చనిపోరని చెప్పగా ఆయన వెంటనే ఒప్పుకున్నారని కాల భైరవ పేర్కొన్నారు. కాల భైరవ వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భాగ్ సాలే సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. భాగ్ సాలే సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: