జైలర్ సినిమా నుంచి అప్డేట్..!!
అనిరుద్ రవిచంద్ర అన్నమలై నుండి రజినీకాంత్ నాలుగు వేళ్ళు పట్టుకున్నట్లుగా చూపించి ఒక ఫోటోను సైతం ఫిట్ చేయడం జరిగింది. అనిరుద్ ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నాలుగు రోజుల్లో తలైవార్ రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ లేదా ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక ఫోటో మాత్రం విడుదల చేయడం జరిగింది మేకింగ్ నుండి ఒక ఫోటోని షేర్ చేశారు. ఇప్పుడు జైలర్ సినిమా నుంచి మొదటి సింగిల్ ను మేకర్ విడుదల చేస్తున్నారని స్పష్టత రావడం జరిగింది.
జులై 4వ తేదీ లేకపోతే 5వ తేదీలో ఈ సింగిల్ విడుదల చేసి ఆస్కారం ఉన్నట్లు సమాచారం.జైలర్ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ అనిరుద్ హిట్ కాంబో నాలుగో సారి రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నెల్సన్ అన్ని చిత్రాలకు కూడా మొదటి సింగిల్ ని అతని స్నేహితుడు నటుడు శివ కార్తికేయన్ సాహిత్యాన్ని అందించడం జరిగింది.కానీ జైలర్ సినిమాలో కార్తికేయన్ రాసిన పాట కూడా ఉండబోతోందా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.