పూనమ్ కౌర్ టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తరచూ తన సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది ఈ నటి. అయితే ఎప్పటినుండో ఈమె పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ అని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు దొరికినప్పుడల్లా వీరిద్దరిపై కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అయితే గతంలో సీనియర్ క్రిటిక్ కత్తి మహేష్ కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది. పూనమ్ సినీ కెరియర్ త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నాశనం చేశారంటూ ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు ఒక మీడియా ఛానల్లో కూర్చుని ఆధారాలు సైతం బయటపెట్టారు కత్తి మహేష్. కానీ ఆ వార్తలని పూనం మరియు ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. కానీ ఇన్ డైరెక్ట్ గా మాత్రం పూనమ్ ఎల్లప్పుడూ త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ లపై టార్గెట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పటివరకు నేరుగా వారిద్దరిపై స్పందించింది లేదు. అయితే తాజాగా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది అలాంటివాడు గురువు ఎలా అవుతాడు అంటూ మండి పడింది. ఈ క్రమంలోనే గురు పౌర్ణమి సందర్భంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక పోస్ట్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది.
ఆయన పవన్ కళ్యాణ్ ని గురు అని సంబోధిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. నా గురు లక్ష్యం నెరవరాలన్నారు. ఇకపై ఆయన ఫేమ్, నేమ్ వాడుకొని ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయను అన్నారు. సీఎం కావాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే పూనం ఫైర్ అయింది.అయితే ఇది చూసిన ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకోచింది.. ప్రతి అడ్డమైనవాడిని గురు అని పిలవకండి. వేదికల మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. దారి చూపించేవాడు గురు అవుతాడు. దయచేసి అర్థం చేసుకోండి, అంటూ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే డైరెక్ట్ గా ఆమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఇలా మాట్లాడింది ..!!