విజయ్: పాలిటిక్స్ లో బిజీ.. అదే లాస్ట్ మూవీ?

Purushottham Vinay
ప్రస్తుతం కోలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ వున్నా తలపతి విజయ్ క్రేజ్ ని మాత్రం మ్యాచ్ చేయలేకపోతున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత కోలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ వున్న హీరోగా ప్రస్తుతం విజయ్ దూసుకుపోతున్నాడు.విజయ్ చిత్రం వస్తుందంటే ఇతర చిత్రాల నిర్మాతల్లో కలవరం. అభిమానుల్లో కోలాహలం ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ స్థాయిలో స్టార్‌ డమ్‌ సంపాదించుకున్న తలపతి విజయ్‌ ఇక నటనకు బ్రేక్‌ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ ప్రస్తుతం లియో వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చిత్ర షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. దీపావళి పండుగకి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది.



కాగా ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే విజయ్‌ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నారు. ఇక ఇది ఆయన 68వ చిత్రం అవుతుంది. బ్రిలియంట్ వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. దీన్ని విజయ్‌ 2024 మే నెలాఖరు కల్లా పూర్తి చేసి ఇక నటనకు బ్రేక్‌ ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇంకా అంతేకాదు ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌ కావాలని నిర్ణయించుకున్నట్లు కూడా ప్రచారం జోరందుకుంది.ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్‌ ఓటుకు నోటుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు గట్టిగానే హితబోధ చేశారు. కాగా 2025 ఏడాదంతా విజయ్‌ ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ సేవా కార్యక్రమాలు ఇంకా రాజకీయ అంశాలపై పూర్తిగా దష్టి పెట్టనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. దీంతో తలపతి విజయ్‌ చర్యలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: