కమలహాసన్ 'ఇండియన్ 2' లో బ్రహ్మానందం.. ఎలాంటి పాత్రలో అంటే..!?

Anilkumar
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'ఇండియన్ 2'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించాడు శంకర్. దీంతో ఈ సినిమాతో పాటు అటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్స్ సైతం శరవేగంగా జరుపుతున్నాడు శంకర్. అయితే ఇండియన్ టు సినిమాలో కమలహాసన్ కి జోడిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు నటిస్తున్నారు. 


అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 
అదేంటంటే ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు అన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా బ్రహ్మానందం భారతీయుడు సినిమాలో నటించబోతున్నారు అన్న వార్త తెలిసిన బ్రహ్మానందం అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా బ్రహ్మానందం ఏ సినిమాల్లో కూడా కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఆయన సినిమాలు చేయడం తగ్గించేశారు. కేవలం ప్రాధాన్యత ఉన్న సినిమాలలో పాత్రలను మాత్రమే చేస్తున్నాడు. 


తాజాగా రంగమార్తాండ సినిమా ద్వారా తనలో ఉన్న నటన నైపుణ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు బ్రహ్మానందం. 
ఇలా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నాడు బ్రహ్మానందం. ఇక ఇలాంటి వ్యక్తి ఇండియన్ టు సినిమాలో నటించబోతున్నాడు అంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిని నెలకొంది. దీంతో కమలహాసన్ బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో అని ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న 'ఇండియన్2' ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: