లైఫ్ స్టైల్: వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన సీజనల్ ఫ్రూట్స్ ఇవే..!

Divya
జూన్ నెల ప్రారంభం నుంచే వర్షాకాలం మొదలైంది. ఇక ఈ వర్షాలు మెల్లమెల్లగా ఊపందుకుంటూ వేడితాపాన్ని తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలన్ని వ్యాధుల కాలం అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలోనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇక ఈ వర్షాకాలంలో అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. దాంతో జలుబు, దగ్గు, విష జ్వరాలు, ఫ్లూ వంటివి వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ సీజన్లోనే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో మన ఆరోగ్యానికి అండగా నిలిచే కొన్ని పండ్లు కూడా ఉన్నాయి.

ఇవి తరచూ వర్షాకాలంలోనే లభిస్తాయి కాబట్టి వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అలాంటి వాటిలో అల్లనేరేడు ఒకటి.. దీనినే బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ వర్షాకాలంలో విరివిగా లభించే ఈ పండ్లను తినడం వల్ల విటమిన్ సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అల్ల నేరేడు పండ్లను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇక అలాగే సీజనల్ గా లభించే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇక ఈ సీజన్లో డెంగ్యూ ,మలేరియా వంటి విష జ్వరాల వ్యాప్తి చాలా అధికంగా వున్న నేపథ్యంలో ప్రతిరోజు దానిమ్మను తీసుకోవాలి. అలాగే రక్తహీనత బారిన పడకుండా ఉండాలి అంటే దానిమ్మ చాలా చక్కగా పనిచేస్తుంది.

వీటితోపాటు ప్రతిరోజు ఒక ఆరెంజ్ పండు కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.  ఇందులో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే గుణాలు ఉన్నాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండటమే కాదు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువే.. ఇక చర్మం కూడా నిగారింపుగా మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: