ఆ విషయంలో డిఫరెంట్ గా వ్యవహారిస్తున్న స్టార్ హీరో కార్తీ...!!
తనకు దర్శకులను రిపీట్ చేయడం నచ్చదో లేక మరో కారణం ఏమైనా ఉందొ కానీ ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా రెండో సినిమా అవకాశం ఇవ్వలేదు. చిన్న హీరో గా కెరీర్ మొదలు పెట్టి తండ్రి బ్యాగ్రౌండ్, అన్న సపోర్ట్ లేకుండా గొప్ప కథలను ఎంచుకుంటూ విభిన్నమైన హీరో అనిపించుకుంటున్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. కార్తీ మాత్రమే కాదు శివ కుమార్ ఇంట్లో చాల మంది నటులే ఉన్న కూడా కార్తీ ది మాత్రం చాల భిన్నమైన ధోరణి. ఇప్పుడు జపాన్ అనే సినిమాలో నటిస్తున్న కార్తీ కేవలం మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం మాత్రమే 2 సినిమాలకు పని చేసాడు. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా ఈ చిత్రం లో నటించిన కార్తీకి మంచి పేరు వచ్చింది. ఇక కార్తీ కథలను ఎంచుకునే పద్ధతి కూడా మొదటి సినిమా నుంచి చాల వేరుగా ఉంటాయి. కథ కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. డీ గ్లామర్ రోల్ అయినా, మాస్ రోల్ అయినా సరే చేయడానికి కార్తీ ఏమాత్రం వెనకాడరు. అలాగే మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడా సంబంధం ఉండదు. తన వరకు సినిమా అంటే కథ మాత్రమే హీరో అనే పద్ధతి లో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కార్తీ. ఇక కార్తీ ఫ్యాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు. అతను నటించిన సర్దార్ సినిమా పలు భాషల్లో విడుదల అయ్యి మంచి విజయాన్ని దక్కించుకుంది. తెలుగు లో కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి.