తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల యువ హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ యువ హీరో కెరియర్ లో ఛలో మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ తో ఈ యువ నటుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమా తర్వాత ఈ నటుడు అనేక మూవీ లలో నటించినప్పటికీ అందులో ఏ మూవీ కూడా ఛలో రేంజ్ విజయాన్ని అందుకోలేదు.
కాకపోతే కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ శౌర్య "రంగబలి" అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాను జూలై 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ కి పవన్ బసంసెట్టీ దర్శకత్వం వహించగా ... కమెడియన్ సత్య ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ప్రస్తుతం ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది.
ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ 2 గంటల 22 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.