మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఇలా "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో అద్భుతమైన గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న చరణ్ ప్రస్తుతం ఇండియా లోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ మూవీ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఈ మూవీ లో సునీల్ , అంజలి , శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మరో 80 రోజుల షూటింగ్ తో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమాలోని చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత చరణ్ ... బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిపోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.