లైగర్ ప్లాప్ పై మొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనంద్ దేవరకొండ..!
తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు నటుడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమాపై షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం. బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ ని ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ఆయన మాటల్లోనే వుంది కరిష్మా... లుక్స్ మాత్రమే కాదు ఆయన డైలాగ్ డెలివరీ, వాయిస్ ని కూడా చాలామంది ఇష్టపడతారు. పెళ్లిచూపులు సినిమా నుంచే ఒక డిఫరెంట్ వాయిస్ ఇండస్ట్రీలో వినిపించింది. అయితే ఆ వాయిస్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక అటువంటి సమయంలో ఆయనతో లైగర్ సినిమాలో నత్తి తో మాట్లాడించడం అనేది ఒక మైనస్ గా మారింది.
ఇక ఇదే విషయం ఎక్కువమంది అభిమానుల నుంచి వినిపించింది. ఇకపోతే ప్రాపర్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది. లైగర్ కోసం అన్న మెంటల్గా, ఫిజికల్ గా కూడా చాలా కష్టపడ్డాడు. అయినా కూడా సినిమా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సినిమా కోసం ఆయన రెండేళ్ల శ్రమ.. నా సినిమాలు ఫెయిల్ అయినా.. పాయింట్ అవుట్ చేసి నువ్వు ఎఫెక్ట్ పెట్టలేదు కాబట్టి సినిమా పోయింది అని అన్న ఎప్పుడూ కూడా అనలేదు. ఆయన లోని ఆ గొప్ప క్వాలిటీనే నేను కూడా చూసి నేర్చుకున్నాను అంటూ తెలిపారు.