కొత్త ఫ్లాట్ కొన్న అజయ్ దేవగణ్.. వామ్మో ఎన్ని కోట్లో తెలుసా?

praveen
అజయ్ దేవగణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచుకున్నాడు. ఆయన బాలీవుడ్ లోనే కాదు కథ, క్యారెక్టర్ నచ్చితే తెలుగులో కూడా సినిమా చేస్తారు. అజయ్ దేవగణ్ వరుస సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. అయితే తాజాగా అజయ్ దేవగణ్ ఒక ఫ్లాట్ కొన్నారంట. ఆ ఫ్లాట్ ఆఫీస్ కోసం కొన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫ్లాట్ 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉందని టాక్ నడుస్తుంది. ఏకంగా ఈ ఫ్లాట్ కోసం అజయ్ దేవగణ్ 45 కోట్లు ఖర్చు చేశారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. 16, 17 అంతస్తులలో రెండు ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేసారంట. 16వ అంతస్తు ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయలు ఉందని, 17వ అంతస్తు ఆస్తుల విలువ 14.74 కోట్లు ఉందని సమాచారం.

అజయ్ దేవగణ్ ప్రస్తుతం మైదాన్ అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ దేవగణ్ వయసు 54 సంవత్సరాలు ఉండగా ఇప్పటికి ఆయన ఫిట్ గా ఉన్నారు. ఆయన వయసు విన్న వారందరు షాక్ అవ్వక తప్పదు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ ఒక్కో సినిమాకి 40 కోట్ల నుంచి 50 కోట్లు తీసుకుంటున్నారు అని టాక్ ఉంది. హిందీలోనే కాదు అజయ్ దేవగణ్ కు టాలీవుడ్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. rrr సినిమాలో కూడా అజయ్ దేవగణ్ ముఖ్యమైన పాత్ర చేసారు. తక్కువ సమయమే ఉన్న ఆ క్యారెక్టర్ సినిమాలో చాలా బాగుంటుంది. ఆ తరువాత వరుస సినిమాల్లో అజయ్ దేవగణ్ బిజీగా ఉన్నారు. త్వరలోనే మైదాన్ సినిమా కూడా థియేటర్ లలో విడుదల కానుంది. అజయ్ దేవగణ్ కొన్న ఫ్లాట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. అయితే కొందరు నెటిజన్లు ఆ ఫ్లాట్ ధర చూసి షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: