హరీష్ శంకర్ ఉస్తాద్ కస్టాలు !
పవన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ తీయాలి అన్నకోరిక అతడి కాలాన్ని హరించి వేసింది అన్నకామెంట్స్ ఉన్నాయి. ఎట్టకేలకు పవన్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీని ప్రారంభించినపప్పటికి ఆమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో హరీష్ శంకర్ కు కూడ తెలియని పరిస్థితి. పవన్ కొన్ని సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన ‘హరిహర వీరమల్లు’ కష్టాలు ఇప్పుడు ‘ఉస్తాద్’ కు వచ్చాయా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు కనీసం ఈరెండు సినీమాలు 2024లో అయినా వస్తాయా అన్నసందేహాలు చాలామందికి ఉన్నాయి.
దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసిన ‘ఓజి’ సినిమా షూట్ చకచకా జరిగిపోతోంది. డిసెంబర్ లో విడుదల అంటున్నారు. కానీ కధ రీత్యా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు వంద రోజుల వర్కింగ్ డేస్ కావాలి అని వార్తలు వస్తున్నాయి. పవన్ మళ్ళీ జూలై నెలలో కూడ వారాహి యాత్ర చేపడతాడు అని అంటున్నారు’ ఒకవేళ అదికుదరక పోతే పవన్ డేట్స్ జూలై ఆగష్టు లో ‘ఓజి’ సినిమాకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.
మధ్యలో తెలంగాణా ఎన్నికలు కూడా ఉన్నాయి వీటిమధ్య పవన్ ‘ఉస్తాద్’ మూవీకి 100 రోజులు కేటాయించడం చాలా కస్టమ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోతున్న ఎన్నికల పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు. విజయం సాధిస్తే అధికార వ్యవహారాల్లో బిజీగా పవన్ బిజీగా ఉంటాడు. ఒకవేళ ఫలితాలతో తేడా వస్తే పవన్ మానసికంగా మళ్లీ సిద్దం కావడానికి చాలాసమయం పడుతుంది. కాబట్టి ‘ఉస్తాద్’ భగత్ సింగ్ కు కూడా ‘హరిహర వీర మల్లు’ కష్టాలు తప్పవు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..