దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాధారణంగా ఆయన దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా రెండు మూడేళ్లు సమయం పడుతుంది. అయితే షూటింగ్ కి రెండేళ్ల సమయం మరియు టెక్నికల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కలుపుకొని మరో ఏడాది చేసిన ఆశ్చర్యం లేదు. ఇక ఎంత లేట్ అయినా.. ఆయన ఎంట్రీ మాత్రం చాలా లేటెస్ట్ గా ఉంటుంది ఆయన సినిమాలో ఎంత లేట్ అయినప్పటికీ ఆ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో ఆయన సినిమాల కోసం టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు దర్శకధిరుడు రాజమౌళి. అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గ ఆర్ట్స్ బ్యానర్పై డా. కే.ఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పాన్ వరల్డ్ సినిమాగా ఈ సినిమాని తీసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల మహేష్ బాబు జిమ్ వీడియోను చూసి అందరూ రాజమౌళి సినిమా కోసమే అని అనుకున్నారు.
అయితే చాక్లెట్ బాయ్ లా కనిపించే మహేష్ బాబుని రూపురేఖలు లేకుండా మార్చేసారని అన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఆఫ్రికన్ సినిమాగా రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో ఎక్కువగా హాలీవుడ్ టెక్నికల్ టీం పనిచేస్తారట. అంతేకాదు నటీనటులు సైతం ఎక్కువగా హాలీవుడ్ నుండి రాజమౌళి ఎంపిక చేసుకున్నారట. అయితే ఈ సినిమా తర్వాత జక్కన్న ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోని తాజాగా సమాచారం ప్రకారం తనకు బాగా దగ్గరైన ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా తీస్తాడట రాజమౌళి. అంతే కాదు ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన ఒక లైన్ ని కూడా అనుకున్నారట. అంతేకాదు వీరిద్దరితో సినిమా చేస్తే బాగుంటుందని రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట..!!